ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్‌ క్విజ్‌ కాంపిటీషన్‌’ను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-06-17T23:56:58+05:30

రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్‌ క్విజ్‌ కాంపిటీషన్‌ పోటీలను విజయవంతం చేయాలని పీసీసీ జనరల్‌ సెక్రటరీ, కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం క్విజ్‌ కాంపిటీషన్‌ ఇన్‌చార్జి బాలరాజు, పీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల, జూన్‌ 17 : రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్‌ క్విజ్‌ కాంపిటీషన్‌ పోటీలను విజయవంతం చేయాలని పీసీసీ జనరల్‌ సెక్రటరీ, కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం క్విజ్‌ కాంపిటీషన్‌ ఇన్‌చార్జి బాలరాజు, పీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి కోరారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలో పార్టీ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చింపుల సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్విజ్‌ పోటీల్లో భాగంగా 16 నుంచి 30 ఏళ్లలోపు యువతీయువకులు భాగస్వాములు కావాలని సూచించారు. పోటీలో పాల్గొనేవారు 7661899899 నెంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడంతో ఎస్‌ఎంఎస్‌ వస్తుందని.. ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ లింక్‌ ఓపెన్‌ చేసి ఫామ్‌ నింపాలని సూచించారు. జూలై 1 వరకు పేర్లు నమోదు చేసుకున్న వారికి జూలై రెండో వారంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకట్‌స్వామి, నాయకులు వసంతం, భీంభరత్‌, షాబాద్‌ దర్శన్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, గోనే ప్రతా్‌పరెడ్డి, బుచ్చిరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, తదితరులున్నారు.

Updated Date - 2023-06-17T23:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising