జోరువాన
ABN, First Publish Date - 2023-07-21T00:28:56+05:30
మూడు రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వానలతో పల్లెలు, పట్టణాలు తడిసి మద్దయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంతెనలపై నుంచి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముసురు వాన రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఊపిరి పోసుకుంటున్న పంటలు కురుస్తున్న వర్షాలతో నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. కాలనీల్లోని రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. వరద నీరు నిలిచి ప్రధాన రహదారుల్లోని గుంతలు ప్రమాదకరంగా మారాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం
పొంగిన నదులు, వాగులు, వంకలు
పలుచోట్ల వంతెనలపై నుంచి ప్రవహించిన వరదనీరు
నిలిచిపోయిన రాకపోకలు.. నస్కల్ వాగు పొంగడంతో దారి మళ్లించిన వాహనాలు
జనజీవనం అస్తవ్యస్తం.. కూలిన ఇళ్లు
గ్రామాల్లో పర్యటించిన అధికారులు
నీట మునిగిన పంట పొలాలు
చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామంలో 20 గొర్రెలు మృతి
వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టరేట్‌లలో 24/7 కంట్రోల్ రూం ఏర్పాటు
మూడు రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వానలతో పల్లెలు, పట్టణాలు తడిసి మద్దయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంతెనలపై నుంచి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముసురు వాన రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఊపిరి పోసుకుంటున్న పంటలు కురుస్తున్న వర్షాలతో నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. కాలనీల్లోని రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. వరద నీరు నిలిచి ప్రధాన రహదారుల్లోని గుంతలు ప్రమాదకరంగా మారాయి.
వికారాబాద్/ మేడ్చల్ జూలై 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/రంగారెడ్డి అర్బన్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు, చెరువుల్లోకి భారీగా నీరు చేరుకుంది. పలుచోట్ల చెక్‌డ్యాంలు, కుంటలు అలుగెత్తి ప్రవహిస్తున్నాయి. బుధవారం రాత్రి ప్రారంభమైన వర్షం గురువారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురియగా, మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు మార్గాల్లో వంతెనలపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు మార్గంలో ఽకెరెల్లి తరువాత బాచారం వద్ద వాగు పొంగి ప్రవహించగా, పీలారం, మద్గుల్ చిట్టంపల్లి, మోత్కుపల్లి, సిద్దులూరు, గిరిగెట్‌పల్లి, నారాయణపూర్, ధన్నారం, దోర్నాల వాగులు ఉధృతంగా ప్రవహించాయి. తాండూరు-పెద్దేముల్ మార్గంలో గాజీపూర్ సమీపంలో, దోర్నాల్ వద్ద తాత్కాలిక వంతెనపై నుంచి వాగులు పొంగి ప్రవహించడంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు మండలంలో బెల్కటూరు, ఐనెల్లి, అల్లాపూర్, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. తాండూరు -కరణ్‌కోట్ మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. కొడంగల్ మండలంలో చిట్టపల్లి- ఖాజా అహ్మద్‌పల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్ద బ్రిడ్జిపై నుంచి వర్షం నీరు ప్రవహించడంతో అన్నారం, నాగారం, ఖాజఅహ్మద్‌పల్లి గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆమార్గంలో రాకపోకలు నిలిచాయి. తాండూరు-సంగారెడ్డి రోడ్డు మార్గ, తాండూరు నుంచి చించొళి, గౌతాపూర్ నుంచి కరన్‌కోట్ వెళ్లే రోడ్డు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి, పూడూరు మండలంలో చన్‌గోముల్ నుంచి బర్లపల్లి, రేగడి మామిడిపల్లి వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కాగ్నా, మూసీ నదుల్లో వరద నీటి ఉధృతి క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ఎస్పీ కోటిరెడ్డి ముందు జాగ్రత్తగా పలు వాగుల వద్ద పోలీసు సిబ్బందిని మొహరింపజేశారు. చెరువులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. వికారాబాద్ జిల్లాలో 1,175 సాగునీటి వనరులు ఉండగా, వాటిలో సగం వరకు వరద నీరు చేరింది. పరిగి-నస్కల్ గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో వికారాబాద్ వెళ్లే వాహనాలను వయా మన్నెగూడ మీదుగా దారి మళ్లించారు. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు కోట్‌పల్లి, నందివాగు, జుంటుపల్లి, లక్నాపూర్, సర్పన్‌పల్లి, అల్లాపూర్, కోట్‌పల్లి ప్రాజెక్టుల్లో కూడా వరద నీరు చేరుతోంది. దౌల్తాబాద్ మండలంలో నందారం, అక్కల్‌చెరువు అలుగెత్తి ప్రవహించింది. బొంరా్‌సపేట్ మండలం, ఏర్పుమల్ల కాక్రవేణి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
నీట మునిగిన పంటలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఊపిరి పోసుకుంటున్న పంటలు నీట మునిగాయి. పంట పొలాల్లోకి వరద నీరు భారీగా చేరడంతో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల నుంచి కోలుకుని పంటలు ఎదిగే సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో నష్టం వాటిల్లుతుందేమోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే విధంగా వర్షం మరో నాలుగైదు రోజులు కురిస్తే మాత్రం పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, పొలాల్లో చేరిన నీటిని చిన్న కాలువలు ఏర్పాటు చేసి బయటకు పంపిస్తే పంటలను కాపాడుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ రైతులకు సూచించారు.
పర్యటించిన అధికారులు
బషీరాబాద్ మండలంలోని నవాల్గ నల్ల చెరువు పూర్తిగా నిండి అలుగు పారడంతో తహసీల్దార్ ఎన్.వెంకటస్వామి, ఆర్‌ఐ రాకేష్ సందర్శించారు. చెరువు సమీపంలోకి ఎవరు వెళ్లకుండా చూడాలని అక్కడి వీఆర్‌ఏలను ఆదేశించారు. తాండూరు తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, అధికారులతో కలిసి వాగులను చింతామణిపట్నంలో కూలిన ఇళ్లను పరిశీలించి వివరాలు సేకరించారు. గౌతాపూర్ వద్ద నీటిలో మునిగిన పొలాలను ఏడీఏ రుద్రమూర్తి ఏఈవో శ్రీనివా్‌సతో కలిసి పరిశీలించారు. అయితే సర్పంచ్ విజయల క్ష్మీ, అధికారులు కాలనీ వాసులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కరన్‌కోట్ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి అత్యవసర పరిస్థితుల్లో తప్పా ప్రజలు బయటికి రావొద్దని సూచించారు
వికారాబాద్ కలెక్టరేట్‌లో 24/7 కంట్రోల్ రూం ఏర్పాటు..
భారీవర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో 24/7 కొనసాగే కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు కాల్ సెంటర్ ఫోన్. 7995061192కు ఫోన్ చేసి సాయం పొందాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోందని తెలిపారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ఆయన జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో చేపడుతున్న సహాయక పనుల ఫోటోలు తన వాట్సా్‌పకు పంపించాలని ఆదేశించారు.
మేడ్చల్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
మేడ్చల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అమోయ్‌కుమార్ కోరారు. జిల్లాలో రెడ్ అలర్డ్ ప్రకటించినందున లోతట్టు ప్రాంతాలు, చెరువులు, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురెతే కంట్రోల్ రూమ్ ఫోన్ నంబరు 9492409781లో సంప్రదించాలన్నారు.
సాయం కోసం డయల్ 100కు కాల్ చేయాలి
అత్యవసర సహాయం అవసరమైతే డయల్ 100కు కాల్ చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. బందోబస్తుపై ఆయన పోలీసు అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరెంట్ స్తంభాలు ముట్టుకోవద్దని, కంచెలేని బావుల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంతెనలను దాటే ప్రయత్నం చేయయొద్దన్నారు. రోడ్డుకు ఇరువైపులా స్టాపర్ కోన్స్ ఏర్పాటు చేయాలన్నారు.
మేడ్చల్ జిల్లాలో
కాగా, మేడ్చల్ జిల్లా చెర్లపల్లి చెరువు, మేడ్చల్ పెద్ద చెరువుతో పాటు కుంటల్లోకి నీరు చేరుతుంది. నాగారం మున్సిపాలిటీ బీఎంఆర్ ఎన్‌క్లేవ్ కాలనీని వరద నీరు ముంచెత్తింది. దమ్మాయిగూడ ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. సమస్యాత్మక ప్రాంతాలను నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, కమిషనర్ రాజేంద్రకుమార్ సందర్శించారు. ఘట్‌కేసర్ మండల పరిధిలోని కొత్తగూడ, కొర్రెముల, ప్రతా్‌పసింగారం వద్ద మూసీనది ఉధృతంగా ప్రవహించింది. మేడ్చల్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లు వార్డుల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. ఘట్‌కేసర్‌లోని ఎరిమల్లెవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈదురుగాలులకు పోచారం సంస్కృతి టౌన్‌షి్‌ఫలో చెట్టు కూలి రోడ్డుపై పడింది. మేడ్చల్ పెద్ద చెరువు వాగు వంతెన ఒక వైపు విరిగి లోపలికి కూరుకు పోయింది.
రంగారెడ్డి జిల్లాలో
రంగారెడ్డి జిల్లాలోని ఈసీ, మూసీ నదులు ఉధృతంగా ప్రవహించాయి. చెక్‌డ్యాంలు అలుగు పారాయి. మట్టి రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. బీటి రోడ్లు దెబ్బతిన్నాయి. గుంతలుగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జన జీవనం స్తంభించింది. భారీ వర్షానికి చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామంలో పెంటయ్య అనే గొర్రెల కాపరికి చెందిన 20 గొర్రెలు మృతి చెందాయి. షాబాద్, చేవెళ్ల మండంలో రెండు ఇండ్లు కూలి పోయాయి. చేవెళ్ల మండలం తంగడపల్లిలో గడ్డమీది నర్సింహులు ఇల్లు వెనుక భాగం కూలింది. గోడలు పదును రావడంతో ఇల్లు కూలింది. అలాగే షాబాద్ మండలంలో కుమ్మరిగూడలో మరో ఇల్లు కూలింది. కొత్తూరు మండల కేంద్రంలోని జేపీ దర్గా రహదారిలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నెలకు కూలింది. విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మత్తులు చేపట్టారు.కేశంపేట మండల పరిధిలోని పాటిగడ్డ సమీపంలో ఉన్న వాగును దాటేందుకు ఓ వ్యక్తి బైక్ వెళ్తూ వరదనీటిలో చిక్కుకోగా గమనించిన స్థానికులు కాపాడి వాగు దాటించారు.
విద్యాసంస్థలకు సెలవులు
భారీ వర్షాల కారణంగా సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం,శనివారం సెలవులు ప్రకటించారు. ఇదే విషయాన్ని విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విటర్ వేదికగా మెసేజ్ పెట్టగా జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు వాట్సాఫ్ గ్రూపుల ద్వారా వాయిస్ మెస్సేస్ అందించారు. కొన్ని పాఠశాలలు ఉదయాన్నే ప్రారంభమవుతుండటంతో మెస్సేజ్ ఆలస్యమైంది. దీంతో స్కూళ్లకు వెళ్లిన పిల్లలు తిరిగి గమ్య స్థానాలకు చేరేలా చర్యలు తీసుకున్నారు.
మేడ్చల్-మల్కాజిరిగి జిల్లాలోని ప్రశాంత్‌నగర్‌లో 111.8 మిల్లిమీటర్లు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. గురువారం మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మేడ్చల్-మల్కాజిరిగి జిల్లాలోని ప్రశాంత్‌నగర్ లో 111.8 మిల్లిమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధుసుధన్‌నగర్‌లో 105.8 మిల్లిమీటర్లు, నాచారంలో 104.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిలా ్లమొయినాబాద్ మండలంకేతిరెడ్డిపల్లిలో అత్యధిక వర్షపాతం 110.5 మిల్లిమీటర్లు నమోదైంది. చేవెళ్ల మండలంకందవాడలో 109.8 మిల్లిమీటర్లు, శేరిలింగంపల్లిమండలం జేపీఎన్ నగర్‌లో 107.5 మిల్లిమీటర్లు, శంకర్‌పల్లి మండలం పొద్దుటూరులో 101.0 మిల్లిమీటర్లు, షాబాద్ మండలం చందనవెల్లిలో 100.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో 110.3 మిల్లిమీటర్లు, మదన్‌పల్లిలో 100.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
Updated Date - 2023-07-21T00:28:56+05:30 IST