వానాకాలంలో చిరుధాన్య పంటలు వేయాలి
ABN, First Publish Date - 2023-02-21T23:52:09+05:30
వచ్చే వాన కాలంలో రైతులు చిరుధాన్య పంటలను విరివిగా సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ తెలిపారు.
కులకచర్ల, ఫిబ్రవరి 21: వచ్చే వాన కాలంలో రైతులు చిరుధాన్య పంటలను విరివిగా సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ తెలిపారు. మంగళవారం కుస్మసముద్రంలో వరి పంటలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు సాగు చేసిన పంటలను మండల వ్యవసాయాధికారుల వద్ద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు చేసుకుంటేనే పండించిన ధాన్యాన్ని ప్ర భుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి చిరుధాన్య పంటల సంవత్సరంగా ప్రకటించిందని, ఆరోగ్య ప్రదాయిని అయిన చిరుధాన్యాల సాగను పెంచాలని సూచించారు. చిరుధాన్యాల సాగు విఽధానం, వాటి ఉపయోగాలపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రోజా, రైతుబంధు కోఆర్డినేటర్ రాములు, ఏఈవో వంశీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T23:52:10+05:30 IST