ప్రజా సేవే లక్ష్యం
ABN, First Publish Date - 2023-08-02T22:42:00+05:30
నాకు భగవంతుడు మస్తుగా ఆస్థినిచ్చిండు.. మంచి బ్యాంకు బ్యాలెన్స్.. మంచి ల్యాండ్ బ్యాంక్.. కొడుకులు, కోడళ్లతోపాటు మంచి ప్రజలను, నాయకులనిచ్చాడు.. అందరి రుణం తీర్చుకొవడానికి గ్రామాల్లో గుళ్లు, రోడ్ల అభివృద్ధ్దికి చర్యలు తీసుకుంటానని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
ఘట్‌కేసర్, ఆగస్టు2 : నాకు భగవంతుడు మస్తుగా ఆస్థినిచ్చిండు.. మంచి బ్యాంకు బ్యాలెన్స్.. మంచి ల్యాండ్ బ్యాంక్.. కొడుకులు, కోడళ్లతోపాటు మంచి ప్రజలను, నాయకులనిచ్చాడు.. అందరి రుణం తీర్చుకొవడానికి గ్రామాల్లో గుళ్లు, రోడ్ల అభివృద్ధ్దికి చర్యలు తీసుకుంటానని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుదవారం ఘట్‌కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో మహిళలకు కుట్టుమిషన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఘట్‌కేసర్ రైల్వేవంతెన నిర్మాణ పాత కాంట్రాక్టర్‌ను తొలగించి నూతన కాంట్రాక్టర్‌కు టెండరు దక్కడంతో మంత్రి మరోసారి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తానన్నారు. కొంత అసల్యం జరిగింది, అన్ని పనులను పూర్తి చేసేందుకు నిరంతరం శ్రమిస్తానన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 43వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ దివాల తీస్తున్నాయని జోస్యం చెప్పారు. 2024లో దేశంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. కర్ణాటకలో బిడ్డపుడితే.. ఇక్కడ ముద్దాడితే ఎలా అని.. ఎప్పుడై నియోజకవర్గంలో తిరిగావా అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. 14 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రైల్వే వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రైల్వే బ్రిడ్జి పనులను మూడు నెలల్లో పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు ముల్లి పావని జంగయ్య యాదవ్, బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్ చైర్మన్లు పల్గుల మాధవరెడ్డి, నానావత్ రెడ్డియా నాయక్, ప్యాక్స్ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, రైతు బంధు కమిటీ మండల అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T22:42:00+05:30 IST