ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-04-03T23:57:48+05:30

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి 316 ఫిర్యాదులు అందాయి.

ప్రజావాణిలో ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను తీసుకుంటున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కలెక్టర్‌ నారాయణరెడ్డి

వికారాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 3: ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి 316 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు జిల్లా అధికారులతో మాట్లాడుతూ, ఈ నెల 5, 11, 14వ తేదీలలో మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. అధికారులందరూ ఈ కార్యక్రమాల్లో తప్పక పాల్గొనాలని చెప్పారు. మునిసిపల్‌, గ్రామ పంచాయతీలలో ఉన్న విగ్రహాలకు రంగులు వేసి పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. అటెండెన్స్‌ యాప్‌తో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్‌, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీఆర్‌డీవో కృష్ణన్‌ వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

ప్రజావాణిలో 97 వినతులు

మేడ్చల్‌ అర్బన్‌: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 97 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. డీఆర్వో లింగ్యానాయక్‌, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - 2023-04-03T23:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising