పీఆర్టీయూతోనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం
ABN, First Publish Date - 2023-02-21T23:32:49+05:30
పీఆర్‌టీయూ సంఘంతోనే రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారమవుతాయని పీఆర్‌టీయూ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి అన్నారు.
ప్రచార కరపత్రాన్ని విడుదల చేస్తున్న నాయకులు
బంట్వారం(కోట్‌పల్లి), ఫిబ్రవరి21: పీఆర్‌టీయూ సంఘంతోనే రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారమవుతాయని పీఆర్‌టీయూ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి అన్నారు. మంగళవారం కోట్‌పల్లితో పాటు వివిధ గ్రామాల్లోని ఉపాధ్యాయులను ఆయన కలిసి తనకు మొదటి ప్రాధాన్య ఓటేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కర పత్రాలను పంచారు. ఆయన వెంట పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, మారుతి, విశ్వేశ్వర్, రామకృష్ణాగౌడ్, శ్రీధర్‌రెడ్డి, రాంరెడ్డి, బాలేశ్వరయ్య తదితరులు ఉన్నారు
Updated Date - 2023-02-21T23:32:50+05:30 IST