ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రవేశ్‌ శుక్లాను ఉరితీయాలి

ABN, First Publish Date - 2023-07-09T23:59:47+05:30

మద్యప్రదేశ్‌లో దస్మత్‌ రావత్‌ అనే గిరిజన యువకుడిపై మూత్రవిసర్జన చేసిన ప్రవేశ్‌ శుక్లాను బహిరంగంగా ఉరితీయాలని ప్రబుద్ద భారత్‌ సంస్థ ప్రతినిధి మీసాల అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఘట్‌కేసర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ప్రబుద్ద భారత్‌ సంస్థ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌, జూలై 9: మద్యప్రదేశ్‌లో దస్మత్‌ రావత్‌ అనే గిరిజన యువకుడిపై మూత్రవిసర్జన చేసిన ప్రవేశ్‌ శుక్లాను బహిరంగంగా ఉరితీయాలని ప్రబుద్ద భారత్‌ సంస్థ ప్రతినిధి మీసాల అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఘట్‌కేసర్‌లో ఆదివారం అంబేడ్కర్‌కు నివాళి కార్యక్రమంలో భాగంగా ఇంతేజామ్‌ కమిటీ ప్రతినిధులతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణ్‌ కుమార్‌, సయ్యద్‌ షానూర్‌ మాట్లాడుతూ.. నేటికీ గిరిజనులపై క్రూరమైన దాడులు జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగిన తర్వాత ఆరాష్ట్ర ముఖ్యమంత్రి దస్మత్‌ రావత్‌ను ఇంటికి పిలిపించి కాళ్లు కడిగిన దృశ్యాలను మనువాదులు జోరుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం కాదు స్వయంగా ప్రధానియే కాళ్లు కాడిగినా తప్పులేదన్నారు. ఈఘటనపై ప్రత్యేక విచారణ జరిపి గిరిజనులకు భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సాయికిరణ్‌, దాసు, నర్సింగ్‌ రావు, శ్రీనివాస్‌, అన్వర్‌, రాజేష్‌ కుమార్‌, వహిద్‌, అంజద్‌, రఫీక్‌, యాసీన్‌, మస్తాన్‌, ఖైరుపాషా, నికిల్‌, అంజయ్య, అనుష్‌ శివ, రవి పాల్గొన్నారు.

Updated Date - 2023-07-09T23:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising