ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డంపింగ్‌ యార్డు ఏర్పాటును అడ్డుకుంటా

ABN, First Publish Date - 2023-04-19T22:41:16+05:30

యాచారం మండల కేం ద్రంలో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయనిచ్చేది లేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ‘డంపింగ్‌ కలకలం’ అనే శీర్షికన వచ్చిన కథనంపై ఎమ్మెల్యే స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే

యాచారం, ఏప్రిల్‌ 19 : యాచారం మండల కేం ద్రంలో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయనిచ్చేది లేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ‘డంపింగ్‌ కలకలం’ అనే శీర్షికన వచ్చిన కథనంపై ఎమ్మెల్యే స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం ఇబ్రహీంపట్నం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దుర్వాసన వెదజల్లే డంపింగ్‌ యార్డును జనం నెత్తిన ఎలా పెట్టనిస్తానన్నారు. బఫర్‌జోన్‌ విషయంలో ఆందోళన చెందరాదన్నారు. దీని ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మైనింగ్‌ జోన్‌ కింద క్రషర్‌ మిషన్లు కూడా ఏర్పాటు చేయనిచ్చేదిలేదన్నారు. దేవాలయ భూములను ఫార్మాసిటీకి తీసుకోనివ్వనని చెప్పారు. రైతులు బకాయిలు చెల్లించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. మేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి గ్రామాల్లో రూ.3 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు వేయించామన్నారు. త్వరలో కుర్మిద్దలో రూ. కోటి వ్యయంతో సీసీ రోడ్లు వేయించనున్నట్లు చెప్పారు. మాల్‌లో సంత కోసం 3ఎకరాల భూమి కేటాయించడంతో పాటు, యాచారంలో ముస్లింల శ్మశాన వాటిక కోసం రెండెకరాల భూమి కేటాయిస్తామని చెప్పారు. నందివనపర్తిలో రోడ్డు వేయించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ యాచారం మండల అధ్యక్షుడు కె.రమే్‌షగౌడ్‌ ఉన్నారు.

Updated Date - 2023-04-19T22:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising