దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది
ABN, First Publish Date - 2023-02-21T23:47:02+05:30
అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.
చేవెళ్ల, ఫిబ్రవరి 21: అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్ల మాజీ ఎంపీపీ బాల్‌రాజ్ చేవెళ్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎ్‌స.రత్నం, ప్రజాప్రతినిధులు ఆలయంలో పూజలు చేశారు. అనంతరం సునీతారెడ్డి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి దైవ చింతనను అలవర్చుకోవాలన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జాతరకు వచ్చే భక్తుల కోసం అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ప్యాక్స్ చైర్మన్ దేవరవెంకట్‌రెడ్డి, సర్ప ంచ్ వెంకటేశంగుప్తా, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు మాణిక్యరెడ్డి, నర్సింలు, మాజీ సర్పంచ్‌లు మధుసూదన్‌గుప్తా, రాంచంద్రయ్యగౌడ్, నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, యాదగిరి, జంగయ్య, మాణిక్యప్రభు, వెంకటేశ్, దయకర్, మణిక్యం, గ్రామస్తులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T23:47:03+05:30 IST