కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలి
ABN, First Publish Date - 2023-08-04T22:30:56+05:30
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకుఆనంద్ రెండవ రోజు మాట్లాడారు. వికారాబాద్ నియోజకవర్గంలోని బంట్వారం మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మంగ్రా్‌సపల్లి, కోట్‌పల్లి మండల పరిధిలోని కంకణాలపల్లి గ్రామపంచాయతీ నుంచి కంకణాపల్లితండా, బార్వాత్ తండా గ్రామపంచాయతీ నుంచి మద్గుల్ తండాలను గ్రామ పంచాయతీలలు చేయాలని సీఎంను ఎమ్మెల్యే ఆనంద్ కోరారు.
వికారాబాద్, ఆగస్టు 4 : తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకుఆనంద్ రెండవ రోజు మాట్లాడారు. వికారాబాద్ నియోజకవర్గంలోని బంట్వారం మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మంగ్రా్‌సపల్లి, కోట్‌పల్లి మండల పరిధిలోని కంకణాలపల్లి గ్రామపంచాయతీ నుంచి కంకణాపల్లితండా, బార్వాత్ తండా గ్రామపంచాయతీ నుంచి మద్గుల్ తండాలను గ్రామ పంచాయతీలలు చేయాలని సీఎంను ఎమ్మెల్యే ఆనంద్ కోరారు. అలాగే నాగసాన్‌పల్లి గ్రామ పంచాయతీ నుంచి నాగ్‌సాన్‌పల్లితండా , మోమిన్‌పేట మండలం కోల్కుంద పంచాయతీ నుంచి రావులపల్లి, మర్పల్లిమండల పరిధిలోని ఘనపూర్‌పంచాయతీ నుంచి రాంపూర్, పెద్దాపూర్ గ్రామ పంచాయతీ నుంచి కూడుగుంట, ధారూరు మండలం పరిధిలోని ధారూరు గ్రామ పంచాయతీ నుంచి లక్ష్మీనగర్‌తండా, తిమ్మానగర్, మైలారంపంచాయతీ నుంచి కొత్త తండా, స్టేషన్ ధారూరు పంచాయతీ నుంచి డీకే తండా, కేరెళ్లి పంచాయతీ నుంచి కొండాపూర్ కుర్ధు గ్రామాలను పంచాయతీలుగా చేయాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కోరారు.
Updated Date - 2023-08-04T22:30:56+05:30 IST