ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి

ABN, First Publish Date - 2023-03-11T00:17:11+05:30

మహిళా సాధికారతతోనే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.

ఇబ్రహీంపట్నంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు/షాద్‌నగర్‌ రూరల్‌/చేవెళ్ల, మార్చి 10: మహిళా సాధికారతతోనే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని వీకే కన్వెన్షన్‌లో బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమం, సావిత్రిబాయి పూలే వర్ధంతిలో ఆయన మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అవకాశాలను అందిపుచ్చుకుంటూ అద్భుతాలు సాధిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల్లో లేడీ్‌సకు 50 శాతం రిజర్వేషన్లతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. మహిళా చైతన్యంతోనే నేరాలు తగ్గుముఖం పట్టాయ న్నారు. బాలికల చదువుపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ శిక్షణతో 386మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఎస్సైలుగా, పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగాలు సాధించారని కిషన్‌రెడ్డి చెప్పారు. మరో 800మంది పోలీసు ఉద్యోగాలు, గ్రూప్‌ పోస్టుల కోసం శిక్షణ పొందుతున్నార న్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే గృహలక్ష్మి పథకం కింద ఇంటి స్థలమున్న పేదలు ఇల్లు కట్టుకోవాలని, వారికి రూ.3లక్షలు మంజూరుచేస్తారన్నారు. ఫార్మాసిటీ, కొంగరకలాన్‌ ఫ్యాక్స్‌కాన్‌ ఎలకా్ట్రనిక్‌ కంపెనీల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షురాలు నల్లబోలు మమత, ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, సర్పంచ్‌ల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదయశ్రీ, నవ్య ఫౌండేషన్‌ చైర్పర్సన్‌ శ్రీరమ్య, మాధవి, శ్వేత, భారతి, లక్ష్మి, సుకన్య, శ్రీలత, సు జాత తదితరులున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమనగల్లు తహసీల్దార్‌ జ్యోతి, సీపీడీవో సక్కుబాయి అన్నారు. ఆమనగల్లు రైతువేదికలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తా ల మండలాల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. ఉత్తమంగా విధులు నిర్వహించిన అంగన్‌వాడీలను తహసీల్దార్‌, సీడీపీవో సత్కరించారు. సూపర్‌వైజర్లు శబరి, జయమ్మ, సరళ, పార్వతి, మమత, కవిత, తిరుపతమ్మ, పద్మ, బాలమణి, మంగ పాల్గొన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం దేవునిపల్లిలో మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. సర్పంచ్‌ రాఘవేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కార్యదర్శి, ఉపసర్ప ంచ్‌, ఉపాధ్యాయినులు, అంగన్‌వాడీలు, ఆశాలను స న్మానించారు. పంచాయతీ కార్యదర్శి రజిని, ఉపసర్పంచ్‌ లక్ష్మి పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చేవెళ్ల మోడల్‌ స్కూల్‌ ప్రి న్సిపాల్‌ టేనవతి, బాలుర పాఠశాల హెచ్‌ఎం లక్ష్మి అన్నారు. మోడల్‌ స్కూ ల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమాన వేతనాలు, సమాన గుర్తింపు కోసం అమెరికాలో చేసిన ఆందోళనలతో ప్రపంచ వ్యాప్త ంగా మహిళలు ఉద్యమించారన్నారు. 1977 మార్చి 8న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో గర్ల్స్‌ స్కూల్‌ హెచ్‌ఎం రజియా సూ ల్తానా, వెల్ప్‌సన్‌ కంపెనీ మేనేజర్‌ భద్రయ్య, రవీందర్‌, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-11T00:17:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising