ఎంపీడీవో కార్యాలయం పైప్‌లైన్ లీకేజీ
ABN, First Publish Date - 2023-02-11T00:40:09+05:30
మిషన్ భగీరథ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతో ఎంపీడీవో ఆఫీసు వద్ద పైప్‌లైన్ లీకేజీతో నీటి నిల్వ అయి పారిశుధ్యం లోపిస్తోంది.
కార్యాలయం వద్ద నీటి లీకేజీతో ఏర్పడిన గుంత
మొయినాబాద్ రూరల్, ఫిబ్రవరి 10: మిషన్ భగీరథ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతో ఎంపీడీవో ఆఫీసు వద్ద పైప్‌లైన్ లీకేజీతో నీటి నిల్వ అయి పారిశుధ్యం లోపిస్తోంది. చేవెళ్ల-హిమాయత్‌నగర్ రోడ్డులో పైప్‌లైన్‌కు బాలిక గురుకులానికి నీటి కనెక్షన్ ఇచ్చారు. సరిగా కనెక్షన్ ఇవ్వక పైపు లీకై వారం రోజులుగా నీరు వృథాగా పోతోంది. కార్యాలయ పరిసరాల్లో నీటి గుంట ఏర్పడింది. అధికారులు కూడా పట్టి ంచుకోవడం లేదు. ఈ విషయంపై ఎంపీడీఓ సంధ్యను వివరణ కోరగా సిబ్బందికి గతంలోనే చెప్పామని, మరోసారి చెబుతామన్నారు.
Updated Date - 2023-02-11T00:40:10+05:30 IST