ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మోదీ’ది నియంత పాలన

ABN, First Publish Date - 2023-03-02T23:37:44+05:30

కేంద్రంలో మోదీ నియంత పాలన సాగిస్తున్నారని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి ఆరోపించారు.

హాత్‌సే హాత్‌ జోడో కార్యక్రమంలో పాల్గొన్న కోదండరెడ్డి, దండెం రాంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇబ్రహీంపట్నం, మార్చి 2: కేంద్రంలో మోదీ నియంత పాలన సాగిస్తున్నారని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గురువారం నిర్వహించిన ‘హాత్‌ సే హాత్‌’ పాదయాత్రలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని దుయ్యబట్టారు. ఇక ప్రధాని మోదీ పేదలను దోచి కార్పొరేట్లకు దాసోహం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర మోదీ రూ.1100కుపైగా పెంచాడని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500కు సిలిండర్‌ అందజేస్తుందని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు రూ.5 లక్షలదాకా వైద్యసేవలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో లక్ష్మీపతిగౌడ్‌, శేఖర్‌గౌడ్‌, పాండాల శంకర్‌గౌడ్‌, తాళ్లపల్లి కృష్ణ, గుండ్లపల్లి వెంకట్‌రెడ్డి, రమే్‌షగౌడ్‌, ఉదయ్‌పాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రఘు, మల్లారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, రాంబాబు, హతీరాం, కరుణాకర్‌రెడ్డి, అలీభాయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!