దవల్‌గారి మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్యే నివాళులు
ABN, First Publish Date - 2023-03-02T23:55:09+05:30
మండలంలోని తిమ్మారెడ్డిపల్లి వాస్తవ్యులు, తెలంగాణ ఉద్యమ నాయకుడు దవల్‌గారి మహేందర్‌రెడ్డి 7వ వర్థంతి సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నివాళులర్పించారు.
నవాబుపేట, మార్చి 2: మండలంలోని తిమ్మారెడ్డిపల్లి వాస్తవ్యులు, తెలంగాణ ఉద్యమ నాయకుడు దవల్‌గారి మహేందర్‌రెడ్డి 7వ వర్థంతి సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నివాళులర్పించారు. గురువారం తిమ్మారెడ్డిపల్లి గేటు దగ్గర ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్‌చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి, వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగారెడ్డి, ప్రకాశం, కేదర్‌నాథ్, ప్రభాకర్‌రెడ్డి, శాంతికుమార్, ధర్మయ్య, మహేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, సుజిత్, ప్రేమ్‌రాథోడ్, సత్తిరెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T23:55:09+05:30 IST