ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీవీఆర్‌ కళాశాలలో ఎంఐడబ్ల్యూఏఐ-2023 సదస్సు ప్రారంభం

ABN, First Publish Date - 2023-07-22T00:19:56+05:30

మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పల్లిలో గల సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంఐడబ్ల్యూఏఐ-2023(మల్టీ డిసిప్లినరీ ఇంటర్‌నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ డాక్టర్‌ డీకే మల్హోత్రా

ముఖ్య అతిథిగా హాజరైన థామస్‌ జెఫర్సన్‌ యూనివర్సిటీ

ప్రొఫెసర్‌ డాక్టర్‌ డీకే మల్హోత్రా, తదితరులు

ఆదిభట్ల, జూలై 21 : మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పల్లిలో గల సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంఐడబ్ల్యూఏఐ-2023(మల్టీ డిసిప్లినరీ ఇంటర్‌నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈమేరకు ఆర్టీఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ మరియు అనువర్తనాలు దాని అనుబంధ నైపుణ్యాలపై రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి ప్రొఫెసర్లు, బిజినెస్‌ ఎక్స్‌పర్ట్స్‌, సైంటిస్టులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సును సీవీఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అమెరికాలోని థామస్‌ జెఫర్సన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డీకే మల్హోత్రా మాట్లాడుతూ మల్టీ డిసిప్లినరీ సదస్సులు విజ్ఞాన సముపార్జనకు, నైపుణ్యాల అభివృద్ధికి ఏవిధంగా ఉపయోగపడుతాయనే విషయాన్ని వివరించారు. ప్రిన్సిపాల్‌ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) విధానం దాని అవసరాలపై వివరించారు. కుత్రిమ మేధస్సు అనేది యంత్రాలు, ముఖ్యంగా కంప్యూటర్ల ద్వారా మానవ మేధస్సు ప్రక్రియలను అనుకరించడమేనని తెలిపారు. మైసూర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డీఎస్‌ గురు మాట్లాడుతూ మెషీన్‌ లర్నింగ్‌, డీప్‌ లర్నింగ్‌లపై వివరిస్తూ భవిష్యత్‌లో వాటి అవసరాలు ఎలా ఉండబోతున్నాయో తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ శివారెడ్డి, చైర్మన్‌ డాక్టర్‌ రాఘవ, నిర్వాహకులు డాక్టర్‌ ఎ.వాణి వత్సల, సీఎ్‌ససీ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-22T00:19:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising