ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేషన్‌ రుణాలపై భగ్గుమన్న మైనారిటీలు

ABN, First Publish Date - 2023-02-07T00:15:09+05:30

దళితబంధు పథకంలో భాగంగా ఒక్కో యూనిట్‌ కింద రూ.10లక్షలు ఇచ్చి.. మైనారిటీ కార్పొరేషన్‌ రుణాలు మాత్రం మండలం మొత్తానికి కలిపి రూ.6 లక్షలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమంటూ మైనారిటీ ఆందోళనకు దిగారు.

మైనారిటీలకు మద్దతు తెలుపుతున్న వైస్‌ ఎంపీపీ మధులత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దేముల్‌, ఫిబ్రవరి 6 : దళితబంధు పథకంలో భాగంగా ఒక్కో యూనిట్‌ కింద రూ.10లక్షలు ఇచ్చి.. మైనారిటీ కార్పొరేషన్‌ రుణాలు మాత్రం మండలం మొత్తానికి కలిపి రూ.6 లక్షలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమంటూ మైనారిటీ ఆందోళనకు దిగారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. వారికి వైస్‌ ఎంపీపీ మధులత మద్దతు పలికారు. కాగా, మైనారిటీ కార్పొరేషన్‌ కింద రుణాలు ఇస్తున్నామని చెప్పడంతో.. మండలంలోని 329మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం లక్కీడ్రా ఉందని చెప్పడంతో వారంతా మండలానికి చేరుకున్నారు. తీరా అధికారులు కేవలం ఒక్క యూనిట్‌ విలువ రూ.లక్ష చొప్పున 6యూనిట్లు మాత్రమే మంజూరు ఇచ్చారని, లక్కీడ్రా ద్వారా లబ్దిదారులను ఎన్నుకుంటామని చెప్పడంతో వారంతా ధర్నా చేసి, ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు. తమకు మీరు వేసే బిస్కట్లు అవసరం లేదని, కనీసం దరఖాస్తు చేసుకున్న వారిలో 90శాతం నిధులనైనా మంజూరు చేయాలని ఆందోళనకు దిగారు. 90శాతం యూనిట్లు మంజూరు చేయాలని ఎంపీడీవో లక్ష్మప్పకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2023-02-07T00:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising