ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహారంలో చిరుధాన్యాలను తీసుకోవాలి

ABN, First Publish Date - 2023-03-25T22:54:47+05:30

రోజూ ఆహారంలో చిరుధాన్యాలను తప్పక తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని జిల్లా సంక్షేమాధికారి మోతి, సీడీపీవో జి.శాంతిశ్రీ అన్నారు.

ఇబ్రహీంపట్నం: మాట్లాడుతున్న జిల్లా సంక్షేమాధికారి మోతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు/చేవెళ్ల, మార్చి 25: రోజూ ఆహారంలో చిరుధాన్యాలను తప్పక తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని జిల్లా సంక్షేమాధికారి మోతి, సీడీపీవో జి.శాంతిశ్రీ అన్నారు. ‘పోషణ పక్షం’లో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. చిరుధాన్యాలు తిన్నందునే అప్పటి ప్రజలు ఆరోగ్యం ఉండేవారన్నారు. ఇప్పుడు జంక్‌ ఫుడ్‌, పిజ్జా, బల్గర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ తింటున్నందునే పిల్లలు, యువత అనారోగ్యం పాలవుతున్నారన్నారు. వీటికి దూరంగా ఉంటేనే మనకు మేలన్నారు. కిషోర బాలికలకు రక్తపరీక్షలు నిర్వహించారు. పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శించారు. వెల్‌ బేబీలకు బహుమతులందజేశారు. శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ గిరిజ, ఏడీ జయరాజ్‌, ఎంఈవో కె.వెంకట్‌రెడ్డి, వైద్యాధికారి నాగయ్య, సర్పంచ్‌ అశోకవర్ధన్‌రెడ్డి, ఏసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఆమనగల్లు సీడీపీవో సక్కుబాయి ఆమనగల్లు కసూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పోషణ పక్షోత్సవాల్లో పాల్గొ ని చిరుధాన్యాలపై బాలికలకు వివరించారు. కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు ప్రదర్శించారు. ఫైబర్‌, ప్రొటీన్‌, విటమిన్లు ఉండే చిరుధాన్యాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్వో పద్మజ్యోతి, సూపర్‌వైజర్లు శబరి, జయమ్మ, సరళ, పార్వతి, పద్మ, బాలమణి, తిరుమల, మమత, టీచర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పోషకాహారాన్ని తీసుకోవాలని రామన్నగూడ సర్పంచ్‌ లావణ్యశంకర్‌ అన్నారు. అంగన్‌వాడీలో మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీల ద్వారా అందజేస్తున్న ఆహార పదార్థాలను వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - 2023-03-25T22:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising