వివాహిత అదృశ్యం
ABN, First Publish Date - 2023-01-18T00:05:11+05:30
ఇంట్లో నుంచి వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైంది.
హబీబా బేగం
పరిగి, జనవరి 17: ఇంట్లో నుంచి వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైంది. పరిగిలోని మున్నురువాడకు చెందిన హశం కూతురు హబీబాబేగం (25)కు హైదరాబాద్‌కు చెందిన ఇస్మాయిల్‌తో వివాహమైంది. కొన్నిరోజులుగా హబీబాబేగం ఆరోగ్యం బాగాలేక పదిరోజుల క్రితం తల్లిగారింటికి వచ్చింది. 16న ఉదయం నిద్ర లేచిన హశం తన కూతురు ఇంట్లో కనిపించకపోవడంతో వెతికాడు. ఎంతకూ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు.
Updated Date - 2023-01-18T00:05:12+05:30 IST