బైక్‌పై నుంచి పడి వ్యక్తికి గాయాలు
ABN, First Publish Date - 2023-02-21T00:40:04+05:30
ఉపాధి హామీ టెక్నికల్ అసెస్టెంట్‌కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ప్రమాదం కుప్పన్‌కోట్ రోడ్డులో సోమవారం జరిగింది.
బషీరాబాద్, ఫిబ్రవరి 20: ఉపాధి హామీ టెక్నికల్ అసెస్టెంట్‌కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ప్రమాదం కుప్పన్‌కోట్ రోడ్డులో సోమవారం జరిగింది. కుప్పన్‌కోట్‌లో సోషల్ ఆడిట్ జరుగుతోంది. రోజంతా ఆడిటర్స్ వెనక ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ శామప్ప సాయంత్రం బైక్‌పై ఇంటికి వెళ్తుండగా మలువు వద్ద అదుపు తప్పి పడిపోయాడు. దీంతో శామప్పకు చేతికి, కాలికి గాయాలయ్యాయి. కుప్పన్‌కోట్ సర్పంచ్ భర్త చందర్ వెంటనే తాండూరు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాడు. శామప్పను గ్రామస్తులు పరామర్శించారు.
Updated Date - 2023-02-21T00:40:05+05:30 IST