అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-05-26T23:58:37+05:30
చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శంకర్‌పల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
శంకర్‌పల్లి మే 26 : చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శంకర్‌పల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీకి చెందిన కనకంటి శ్రీనివాస్(45) వృత్తిరీత్యా తాపీ మేస్త్రీ. కుటుంబ అవసరాల కోసం రూ.10లక్షల వరకు అప్పు చేశాడు. అయితే, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిత్యం సతమతమయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Updated Date - 2023-05-26T23:58:37+05:30 IST