ఆలయ హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తి రిమాండ్
ABN, First Publish Date - 2023-08-31T23:34:29+05:30
ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఘట్‌కేసర్ పోలీసులు తెలిపారు.
ఘట్‌కేసర్ రూరల్, ఆగస్టు 31: ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఘట్‌కేసర్ పోలీసులు తెలిపారు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ బాలాజీనగర్‌కు చెందిన కంది సతీష్(23) ఆగస్టు 29న ఎస్‌ఎఫ్‌సీ నగర్‌లోని హనుమాన్ ఆలయంలో చొరబడి అక్కడ ఉన్న హుండీ చోరీ చేశాడు. దీంతో పోలీసులు విచారణలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి సతీష్‌గా గుర్తించారు. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సతీష్ పాత నేరస్తుడని, అతడిపై పలు చోరీలకు సంబంధించి పాత కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-08-31T23:34:29+05:30 IST