ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రె్‌సలో చేరిన మామిడి భీంరెడ్డి

ABN, First Publish Date - 2023-09-02T00:00:03+05:30

బీజేపీ మాజీ సీనియర్‌ నాయకుడు, రెడ్‌క్రాస్‌ సొసైటీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మామిడి భీంరెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

పార్టీలోకి ఆహ్వానిస్తున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

కొత్తూర్‌, 1: బీజేపీ మాజీ సీనియర్‌ నాయకుడు, రెడ్‌క్రాస్‌ సొసైటీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మామిడి భీంరెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన మామిడి భీంరెడ్డి 35సంవత్సరాల పాటు బీజేపీలో కొనసాగారు. అయితే, షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేరారు. భీంరెడ్డిని రేవంత్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భీంరెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడైన రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతోనే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ షాద్‌నగర్‌ నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు తిరుపతిరెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2023-09-02T00:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising