ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యాలయాల హబ్‌గా మహేశ్వరం నియోజకవర్గం

ABN, First Publish Date - 2023-09-08T23:40:48+05:30

మహేశ్వరం నియోజకరవర్గం విద్యాలయాలకు హబ్‌గా మారిందని, ఇప్పటికే మహేశ్వరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరులో మెడికల్‌ కళాశాల మంజూరయ్యాయని, తాజాగా సీఎం కేసీఆర్‌ కృషితో కందుకూరులో లా కళాశాల మంజూరైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు.

బీఆర్‌ఎ్‌సలో చేరుతున్న కల్వకోల్‌ బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలకు కండువాలు వేస్తున్న మంత్రి పి.సబితారెడ్డి

కందుకూరుకు లా కళాశాల మంజూరు

విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి

కందుకూరు, సెప్టెంబరు 8: మహేశ్వరం నియోజకరవర్గం విద్యాలయాలకు హబ్‌గా మారిందని, ఇప్పటికే మహేశ్వరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరులో మెడికల్‌ కళాశాల మంజూరయ్యాయని, తాజాగా సీఎం కేసీఆర్‌ కృషితో కందుకూరులో లా కళాశాల మంజూరైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా కందుకూరు, హనుమకొండల్లో ప్రభుత్వ లా కాలేజీలను ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. గతంలో ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువులకు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో నియోజకవర్గానికి అనేక విద్యాసంస్థలను మంజూరు చేశారన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు మంజూరు చేస్తూనే ఇప్పటికే కందుకూరుకు మెడికల్‌ కాలేజీ సైతం ఇచ్చారన్నారు. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా 400పడకల ఆస్పత్రిని సైతం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్తగా లా కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కందుకూరు జ్యోతిబా పూలే డిగ్రీ కళాశాలలో వచ్చే సంవత్సరం నుంచి లా కోర్సును ప్రవేశపెడతాం అని తెలిపారు. కందుకూరు మండలం విద్యా సంస్థలకు నిలయంగా మారనుందని మంత్రి సబిత తెలిపారు.

అభివృద్ధికి ఆకర్శితులై బీఆర్‌ఎ్‌సలో చేరికలు

మహేశ్వరం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండలంలోని కల్వకోల్‌కు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు నగరంలోని మంత్రి నివాసానికి వెళ్లి ఆమె సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. మంత్రి మాట్లాడుతూ.. 9ఏళ్లలో కేసీఆర్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి నాయకులు, కార్యక్తలు బీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని అన్నారు. మహేశ్వరంలో బీఆర్‌ఎ్‌సను తిరుగులేని శక్తిగా చేయాలని. అందుకు నాయకులు, కార్యక్తలు, ఉద్యమకారులు కలిసి ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఎవరేం మాట్లాడినా మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజునాయక్‌, చంద్రయ్య, మోతీలాల్‌, రాజేష్‌, లతీ్‌ఫఖాన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-08T23:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising