ఏఐసీసీ సభ్యుడిగా ఎం.రమేష్
ABN, First Publish Date - 2023-02-21T23:36:38+05:30
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా తాండూరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం.రమేష్ మహరాజ్‌కు పార్టీ అధిష్టానం చోటు కల్పించింది.
ఎం.రమేష్
తాండూరు, ఫిబ్రవరి 21: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా తాండూరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం.రమేష్ మహరాజ్‌కు పార్టీ అధిష్టానం చోటు కల్పించింది. గతంలో ఆయన తండ్రి, మాజీ మంత్రి ఎం.మాణిక్‌రావు ఏఐసీసీ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం రమేష్ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా, తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్నారు. తనకు పార్టీ పదవి ఇచ్చినందుకు రమేష్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ కేంద్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-02-21T23:36:39+05:30 IST