బీజేపీ, బీఆర్‌ఎస్‌లను తరిమికొడదాం
ABN, First Publish Date - 2023-03-05T00:18:42+05:30
ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను వచ్చే ఎన్నికల్లో తరమికొట్టాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు.
చౌదరిగూడ/చేవెళ్ల/, మార్చి, 4 : ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను వచ్చే ఎన్నికల్లో తరమికొట్టాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం చౌదరిగూడ మండలం వీరసముద్రం, రావిర్యాల గ్రామాల్లో కాంగ్రెస్ మండలాధ్యక్షులు చలివేంద్రంపల్లి రాజుతో కలిసి హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శంకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించుకోవడానికి ఎన్నో హామీలు ఇచ్చిన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం ఆయా గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచితే, కేంద్రం వంటగ్యాస్ ధరను పెంచి పేదల కడుపులు కొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు బాబర్‌ఖాన్, బాల్‌రాజ్, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, జితేందర్‌రెడ్డి, పురుషోత్తమ్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు సున్నపు వసంతం అన్నారు. చేవెళ్ల మండలం న్యాలట గ్రామంలో హాత్‌సే హాత్ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, చేవెళ్ల మండలలాధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్, చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూదన్‌గుప్తా, డీసీసీ ప్రధాన కార్యదర్శులు మహేశ్వర్‌రెడ్డి, నాయకులు కార్యర్తలు తదితరులున్నారు.
Updated Date - 2023-03-05T00:18:42+05:30 IST