ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీని రాజకీయంగా బొందపెడతాం

ABN, First Publish Date - 2023-09-23T00:18:38+05:30

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా మాదిగ జాతికి నమ్మకద్రోహం చేస్తున్న బీజేపీని రాజకీయంగా బొందపెడతామని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్యల వర్గీకరణ బిల్లును ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్‌ నాయకులు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు.

రంగారెడ్డి అర్బన్‌ : కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు నర్సింహ మాదిగ

ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌

కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం, నిరసన

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 22 : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా మాదిగ జాతికి నమ్మకద్రోహం చేస్తున్న బీజేపీని రాజకీయంగా బొందపెడతామని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్యల వర్గీకరణ బిల్లును ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్‌ నాయకులు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనతరం బలవంతంగా నాయకులను అదుపులోకి తీసుకుని ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ తరలించారు. కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా రావుగళ్ళ బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్‌ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్‌ కు మార్‌ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకు లు నాని బానుప్రసాద్‌, మద్దిలేటి మాదిగ, శంకర్రావు మాదిగ బత్తిన సుధాకర్‌ మాదిగ, కిరణ్‌ పూలే మాదిగ, కడిగాళ్ల ప్రవీణ్‌ మాదిగ కొమ్ము మహేష్‌ మాదిగ, రావుగాళ్ల బాబు మాదిగ, మద్దిలేటి మాదిగ, క్యాసరం శంకర్‌ రావు మాదిగ బత్తిన సుధాకర్‌ మాదిగ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టులు

కందుకూరు : ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా పోలీసులు నాయకులను ముంద స్తు అరెస్టులు చేశారు. ఆ సంఘం మండల నాయకులు అందుగుల కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటికీ బిల్లు పెట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మండల శాఖ అధ్యక్షుడు ఎం.నర్సింహ, కె.నర్సింహ, తదితరులున్నారు.

Updated Date - 2023-09-23T00:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising