ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అతిపెద్ద కార్గో విమానం

ABN, First Publish Date - 2023-08-02T22:47:21+05:30

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మంగళవారం సాయంత్రం 5.27 గంటలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైంది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండైన కార్గో విమానం

ఇప్పటివరకు విమానాశ్రయంలో రెండోసారి ల్యాండైన ఎయిర్‌బస్‌-ఏ320 (బెలూగా)

2016లో ల్యాండైన ఆంతోనోవ్‌ ఏఎన్‌ 225 కార్గో విమానం

శంషాబాద్‌ రూరల్‌, ఆగస్టు 2 : ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మంగళవారం సాయంత్రం 5.27 గంటలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైంది. థాయిలాండ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఎయిర్‌బస్‌-ఏ320 (బెలూగా) సురక్షితంగా ల్యాండింగ్‌, పార్కింగ్‌, టేకాఫ్‌ అయ్యేందుకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కాగా, ఇది గతేడాది డిసెంబర్‌లో కూడా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 2016లో ఆంతోనోవ్‌ ఏఎన్‌ 225 కార్గో విమానం కూడా ఇక్కడ ల్యాండ్‌ అయింది. కాగా, విమానాశ్రయంలో ప్రయాణికులు, సిబ్బంది ఎయిర్‌బస్‌-ఏ320 కార్గో ఫ్లైట్‌ను ఆసక్తిగా చూశారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. బుధవారం కూడా విమానం ఎయిర్‌పోర్టులోనే ఉంది. నేడు(గురువారం) ఇక్కడి నుంచి బయలుదేరి ఈజిప్ట్‌ వెళుతుందని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - 2023-08-02T22:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising