ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే భూ సమస్యల పరిష్కారం

ABN, First Publish Date - 2023-02-06T23:52:24+05:30

ఇనాం, అసైన్డ్‌ భూముల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

పాదయాత్రలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత ప్రశాంత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచాల, ఫిబ్రవరి 6: ఇనాం, అసైన్డ్‌ భూముల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రగతి నివేదన పాదయాత్ర సోమవారం 16వ రోజు మంచాల మండలంలోని బండలేమూర్‌, చెన్నారెడ్డిగూడ గ్రామాల్లో కొనసాగింది. ఆయన చేపట్టిన పాదయాత్ర 15రోజులుగా 210కిలోమీట్లు పూర్తిచేసుకోవడం విశేషం. ఆయా గ్రామాల్లో గడపగడపకు తిరుగుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండలేమూర్‌ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మిషన్‌కాకతీయ పథకం ద్వారా చెరువుల మరమ్మతులు, పూడిక తీసివేతతో పూర్వవైభవం సంతరించుకున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏర్పుల చంద్రయ్య, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు చీరాల రమేష్‌, బహదూర్‌, ఎంపీపీ జాటోత్‌ నర్మదలచ్చిరాం, గ్రామశాఖ అధ్యక్షుడు లింగం, కిషన్‌నాయక్‌, ఆకారం కృష్ణ, విజయ్‌, సుదర్శన్‌, రమేష్‌, ఎంపీటీసీలు సుకన్య, అనిత, బద్రీనాథ్‌గుప్త, ఏఎంసీ డైరెక్టర్‌ జానీపాష, రవి, ప్రభాకర్‌, మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising