ఘనంగా కుడారే హరతి
ABN, First Publish Date - 2023-01-11T22:49:40+05:30
దులాబాద్‌లోని గోదాసమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి దేవాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా కుడారే (108 పళ్లాలతో ఇచ్చే )హారతి నిర్వహించారు.
ఘట్‌కేసర్‌రూరల్, జనవరి 11 : ఎదులాబాద్‌లోని గోదాసమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి దేవాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా కుడారే (108 పళ్లాలతో ఇచ్చే )హారతి నిర్వహించారు. ధనుర్మాసంలో 27వ రోజున కుడారే హారతి నిర్వహిస్తారని, ఈ హారతి అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైదని పండితులు తెలిపారు. మహిళలు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండితులు పురుషోత్తామాచార్యులు, అనంతసేనామాచార్యులు, శ్రీవాత్సవాచార్యులు అచ్యుతాచార్యులు, భక్తులు జవ్వాజీ లింగం, సుధాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి, మంకం రవి, సురేష్, రాజశేఖర్, బాలకృష్ణ, రాము, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-11T22:49:42+05:30 IST