కార్మికులుగా మారిన ప్రజాప్రతినిధులు
ABN, First Publish Date - 2023-07-21T23:58:14+05:30
పంచాయతీ కార్మికుల సమ్మెతో ప్రజాప్రతినిధులే కార్మికులుగా మారారు.
చీర్యాల్‌లో శుభ్రం చేస్తున్న సర్పంచ్ తుంగ ధర్మేంధర్
కీసర, జూలై21: పంచాయతీ కార్మికుల సమ్మెతో ప్రజాప్రతినిధులే కార్మికులుగా మారారు. గ్రామంలోని చెత్త, చెదారాన్ని శుభ్రం చేశారు. కొన్ని రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుండగా గ్రామాలల్లో పారిశుధ్యం లోపించింది. దీంతో చేసేది లేక శుక్రవారం చీర్యాల్ గ్రామ సర్పంచ్ తుంగ ధర్మేంధర్, భోగారం ఉపసర్పంచ్ జానకీరామ్ రోడ్లపై ఉన్న చెత్తను సేకరించి ట్రాక్టర్‌లో తరలించారు. చీర్యాల్ సర్పంచ్ వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడటంతో మట్టితో పూడ్చి వేయించారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేంత వరకు ప్రజాప్రతినిధులకు ఇలాంటి తిప్పలు తప్పవని స్థానికులు వాపోతున్నారు.
Updated Date - 2023-07-21T23:58:14+05:30 IST