అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
ABN, First Publish Date - 2023-02-21T23:54:42+05:30
అంబేద్కర్, రాష్ట్రపతి, రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సామ కృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని
దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్
చేవెళ్ల, ఫిబ్రవరి 21 : అంబేద్కర్, రాష్ట్రపతి, రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సామ కృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చేవెళ్ల మండలం దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ మాణిక్యరెడ్డి సోదరుడు సామ కృష్ణారెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతోపాటు రిజర్వేషన్లను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆగ్రహించిన దళిత ప్రజాసంఘాల నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని వారు చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో సోమవారం అర్థరాత్రి బైఠాయించారు. దీంతో చేవెళ్ల సీఐ వెంకటేశ్వర్లు, ఏసీపీ ప్రభాకర్ స్పందించి కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నాయకులు శాంతించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్రి నరసింహ, దళితరత్న అవార్డు గ్రహీత బురాన్ ప్రభాకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరిరాజు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలు కె.నారాయణదాస్, ఆనంద్, సత్తయనారాయణచారి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు గోపాల్, చంద్రశేఖర్, సత్యం, రామకృష్ణ, తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-02-21T23:54:43+05:30 IST