ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమురయ్య పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

ABN, First Publish Date - 2023-04-03T23:59:05+05:30

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని నాయకులు అన్నారు. మేడ్చల్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు.

మేడ్చల్‌ టౌన్‌: దొడ్డి కొమురయ్యకు నివాళులర్పిస్తున్న మేడ్చల్‌ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మేడ్చల్‌టౌన్‌/కీసర రూరల్‌/కీసర/ఘట్‌కేసర్‌ రూరల్‌/మూడుచింతలపల్లి/పరిగి, ఏప్రిల్‌ 3: తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని నాయకులు అన్నారు. మేడ్చల్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ మహేష్‌, మధుకర్‌ యాదవ్‌, నాగేందర్‌ బాల మల్లేష్‌, సయ్యద్‌ లాయక్‌ పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ రాములు నివాళులర్పించారు. అదేవిధంగా నాగారం మున్సిపాలిటీ రాంపల్లి చౌరస్తాలో, రాంపల్లిలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి, వైస్‌చైర్మన్‌ మల్లే్‌షయాదవ్‌, కౌన్సిలర్లు శ్రీనివా్‌సగౌడ్‌, కళావతి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కీసరలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అధికారులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీ నారాయణ, సహకార సంఘం చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు మాధురి, మహేందర్‌, ధర్మేంధర్‌, ఎంపీటీసీ నారాయణశర్మ, శ్రావణ్‌గుప్తా, జంగయ్య యాదవ్‌, సుధాకర్‌రెడ్డి, సురేష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఘట్‌కేసర్‌ పరిధి మర్రిగూడలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి పాల్గొని కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైసయ్య, సాయికుమార్‌, సురేష్‌, లింగయ్య, ఆయిలయ్య, కుమార్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామ పంచాయతీ ఆవరణలో దొడ్డి కొమురయ్యకు ఉపసర్పంచ్‌ బుద్ధి శ్రీనివాస్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్‌, శ్రీశైలం, మల్లేష్‌, సుధాకర్‌, వీరేశ్‌, మహంకాళి పాల్గొన్నారు. పరిగిలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శివాజీ, దొడ్డి కొమురయ్యల చిత్రపటాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్‌ శ్రీనివాస్‌, ఎల్‌హెచ్‌పీఎ్‌స రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, నాయకులు అంబర్‌సింగ్‌, ప్రకాశ్‌, అనిల్‌, శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising