ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కేసీఆర్‌ నియంతృత్వ పాలనను అంతమొందించాలి’

ABN, First Publish Date - 2023-06-03T00:07:46+05:30

రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతృత్వ పాలనను అంతంమొందించేందుకు నాటి తెలంగాణ సాయుధ పోరాటం తరహాలో కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌదరిగూడ, జూన్‌ 2: రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతృత్వ పాలనను అంతంమొందించేందుకు నాటి తెలంగాణ సాయుధ పోరాటం తరహాలో కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కాలరాస్తూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. హామీల అమలులో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నియామకాలు కనుమరుగైపోయాయని అన్నారు. కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్‌ మండలాధ్యక్షురాలు రజిత, నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభం

నందిగామ : తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా నందిగామ మండలకేంద్రంలో వీర్లపల్లి శంకర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. సోనియాగాంధీ చిత్రపటానికి క్షీ రాభిషేకం చేశారు. మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ఉద్యమకారులను సన్మానించారు. మండలాధ్యక్షుడు నర్సింలు, జిల్లా ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీలు కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి, కుమార్‌గౌడ్‌ సర్పంచ్‌ పాండురంగారెడ్డి, రజినీకాంత్‌ నాయకులున్నారు.

Updated Date - 2023-06-03T00:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising