ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ‘కేసీఆర్‌ ట్రోఫీ’

ABN, First Publish Date - 2023-02-02T00:04:02+05:30

గ్రామీణ ప్రాంత క్రీడాకారులు, యువత క్రీడల్లో రాణించేందుకే కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ తెలిపారు.

యాలాల : కేసీఆర్‌ క్రికెట్‌ టీర్నీని ప్రారంభిస్తున్న శుభప్రద్‌ పటేల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాలాల/మర్పల్లి/నవాబుపేట/పెద్దేముల్‌, ఫిబ్రవరి 1 : గ్రామీణ ప్రాంత క్రీడాకారులు, యువత క్రీడల్లో రాణించేందుకే కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని బుధవారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ సహారా గ్రౌండ్‌లో సీఎం కేసీఆర్‌-శుభప్రద్‌పటేల్‌ యువసేనా ఆధ్వర్యంలో కేసీఆర్‌ ట్రోఫీని జెడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌తో కలిసి శుభప్రద్‌పటేల్‌ ప్రారంభించారు. నాయకులు తదితరులున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో నైపుణ్యం వెలికి తీసేందుకు టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడుతాయని కాంగ్రెస్‌ పార్టీ మర్పల్లి మండలాధ్యక్షుడు యు.రవీందర్‌ అన్నారు. మండల పరిధిలోని కొంషెడ్‌పల్లి గ్రామంలో శైలజ స్మారక కబడ్డీ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ సతీమణి శైలజ.. ఇలాంటి క్రీడల కోసం, యువతకోసం ఎంతగానో కృషి చేసిందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 30కి పైగా కబడ్డీ జట్లు తమ పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందని నిర్వాహకులు రఫియోద్దీన్‌, శేఖర్‌ తెలిపారు. అనంతరం శైలజ చిత్రపటానికి వారు నివాళులర్పించి టోర్నమెంట్‌ ప్రారంభించారు. కాంగ్రెస్‌ జిల్లా నాయకులు కలిమోద్దీన్‌, సలీం, సాయిబాబ, సర్వేశ్‌, టి.శ్రీనివాస్‌, బి.సతీ్‌షకుమార్‌, టి.రాము, టి.నవీన్‌, తదితరులు పాల్గొన్నారు. నవాబుపేట మండలం మూలమాడ, ఎక్‌మామిడి గ్రామాల శివారులో క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. వార్డుసభ్యులు యాదయ్య, డీలర్‌ వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ యువజన జిల్లా నాయకులు సాయికుమార్‌, క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వాహకులు బాల్‌రాజ్‌, నగేశ్వర్‌, వినోద్‌కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులున్నారు. పెద్దేముల్‌ తండాలో బంజారా క్రికెట్‌ టోర్నమెంట్‌ను జడ్పీటీసీ ధారాసింగ్‌ కుమారులు నవీన్‌, సునీల్‌లు ప్రారంభించారు.

Updated Date - 2023-02-02T00:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising