కుల వృత్తులకు కేసీఆర్ పెద్దపీట
ABN, First Publish Date - 2023-08-22T23:29:24+05:30
ఆఽధునికతతో ఉపాఽధి కల్పోయిన కుల, చేతి వృత్తుల వారికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
కందుకూరు ,ఆగస్టు 22 : ఆఽధునికతతో ఉపాఽధి కల్పోయిన కుల, చేతి వృత్తుల వారికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం బీసీ బంధు కింద నియోజకవర్గ స్థాయిలో 300 మంది లబ్ధిదారులకు మంగళవారం మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు దయనంద్‌గుప్తా, సురబీవాణిదేవిలతో చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతి పక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తున్న రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. బీసీ బంధు కింద రంగారెడ్డి జిల్లాలో 2100 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఇటీవల మైనార్టీ బంధు ద్వార 8500 మందికి లక్ష రూపాయల చెక్కులను అందజేసినట్లు గుర్తు చేశారు. త్వరలో రెండవ విడత దళితబంధు అమలు చేయడానికి సీఎం కేసీఆర్ సిద్ధ్దంగా ఉన్నట్లు తెలిపారు. తనను సీఎం కేసీఆర్ మరోసారి మహేశ్వరం నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు అవకాశం ఇచ్చారని నియోజకవర్గ ప్రజల నుండి సీఎం కేసీఆర్‌కు కృతజ్ణతలు తెలుపుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనకు మరో సారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కాగా మండల కేంద్రంలోని హైద్రాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం అన్నోజిగూడ గ్రామానికి చెందిన పుచ్చల గణేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మంత్రి వారి కుటుంబ సభ్యులను పరమర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, బీసీ కార్పోరేషన్ ఈడీ విమల, ఎంపీపీ మంద జ్యోతి, ఏఎంసీ చైర్మన్ ఎస్ సురేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, వైస్ ఎంపీపీలు జి.శమంతప్రభాకర్, సునీతఅంధ్యానాయక్, ఎస్ రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-22T23:29:24+05:30 IST