ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎస్‌ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా కార్తీక్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-10-28T00:42:42+05:30

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చినప్పటికీ పార్టీలో అక్కడక్కడా నాయకుల మధ్య విభేదాలు, అసమానతలను తొలగించేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజవర్గాల వారీగా పార్టీ నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తోంది.

చేవెళ్ల, అక్టోబరు 27 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చినప్పటికీ పార్టీలో అక్కడక్కడా నాయకుల మధ్య విభేదాలు, అసమానతలను తొలగించేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజవర్గాల వారీగా పార్టీ నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తోంది. ఇందులో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా దివంగత ఇంద్రారెడ్డి రాజకీయ వారసుడు, మంత్రి సబితారెడ్డి కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ అధిష్టానం చేవెళ్ల నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు ఇన్‌చార్జిగా చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కొనసాగారు. అయితే, మారిన రాజకీయ పరిణామాలతో కార్తీక్‌రెడ్డికి పార్టీ అధిష్టానం బాధ్యతుల అప్పగించింది. చేవెళ్ల నియోజకవర్గంలో ఇంద్రారెడ్డి కుటుంబానికి లోకల్‌గా బలమైన పట్టు ఉండటం, యాదయ్య గెలుపు కోసం పార్టీ బాధ్యతలు కార్తీక్‌రెడ్డికి ఇవ్వడంతో పార్టీ శ్రేణలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం చేకురుతుందని నాయకులు చర్చించుకుంటున్నా రు. కాంగ్రెస్‌, బీజేపీలకు దీటుగా ఎన్నికల్లో గెలిచేలా పార్టీ వ్యూహరచనలో భాగంగానే కార్తీక్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిందని సమాచారం.

Updated Date - 2023-10-28T00:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising