ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కర్ణాటక టు బషీరాబాద్‌

ABN, First Publish Date - 2023-08-13T23:38:56+05:30

వ్యవసాయ పనులు జోరందుకోవడంతో కూలీల కొరత నెలకొంది. పొలాల్లో కలుపుతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

గొట్టిగఖుర్దు వద్ద కలుపుతీత పనుల్లో కర్ణాటక కూలీలు

వ్యవసాయ కూలీల కొరత

బషీరాబాద్‌ మండలంలో జోరందుకున్న కలుపుతీత పనులు

కర్ణాటక నుంచి వాహనాల్లో కూలీల తరలింపు

బషీరాబాద్‌, ఆగస్టు 13: వ్యవసాయ పనులు జోరందుకోవడంతో కూలీల కొరత నెలకొంది. పొలాల్లో కలుపుతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో కూలీల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. కలుపుతీత, ఎరువులు వేయడం, మందుల పిచికారీ వంటి వాటికి మనుషులు కొరతయ్యారు. రైతులందరూ ఒకేసారి పనులు చేపడుతుండడంతో కూలీల కొతర వేధిస్తోంది. దీంతో సరిహద్దు కర్ణాటక రాష్ట్రం అడికి, అయ్యాలం, నిడుగుంది, హల్కోడ, జెట్టూరు, పోతుగంటి తదితర గ్రామాల నుంచి కూలీలను ఆటోలు, జీపుల్లో దిగుమతి చేసుకుంటున్నారు. మండలంలో పత్తి 9,150 ఎకరాలు, కంది 14,048 ఎకరాలు, పెసర 1,600, మినుము 480ఎకరాలు, ఇతర పంటలు 950ఎకరాల్లో సాగు చేశారు. కూలీలను కర్ణాటక గ్రామాల నుంచి రవాణా చార్జీలు పెట్టి ఆటోలు, జీపుల్లో తీసుకువచ్చి కలుపుతీత పనులు చేయిస్తున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి మరింత భారంగా మారుతోంది.

Updated Date - 2023-08-13T23:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising