ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కంటివెలుగు’ను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-01-19T00:03:06+05:30

కంటివెలుగు శిబిరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య అధికారులకు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో కంటివెలుగు ఏర్పాట్లు తనిఖీ

కీసరరూరల్‌/ఘట్‌కేసర్‌/తాండూరు రూరల్‌/కులకచర్ల/కొడంగల్‌/ నవాబుపేట/పూడూరు, జనవరి18 : కంటివెలుగు శిబిరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య అధికారులకు ఆదేశించారు. బుధవారం ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని కొండాపూర్‌, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, నాగారం మున్సిపాలిటీ పరిధిలో కంటివెలుగు కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిరోజూ ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేసే విధంగా చూడాలని ఆధికారులను ఆదేశించారు. కంటి పరీక్షలకు వచ్చే వారికి అన్నిరకాల సదుపాయాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమాల్లో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు మేమనరెడ్డి, సురేష్‌, వాణిరెడ్డి, మేనేజర్‌ చంద్రశేఖర్‌, రాంరెడ్డి, కౌన్సిలర్లు సీహెచ్‌ వెంకట్‌రెడ్డి, గొంగళ్లమహేష్‌, మేనేజర్లు అంజిరెడ్డి, నర్సింహులు, ఏఈ నరేష్‌ కుమార్‌, గోపాల్‌రెడ్డి, పాల్గొన్నారు. అదేవిధంగా నేటి(గురువారం) నుంచి ప్రారంభించే కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలను చైతన్య పర్చాలని జినుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వినోద్‌కుమార్‌ సూచించారు. బుధవారం తాండూరు మండలం జినుగుర్తిలో వైద్య సిబ్బందితో కలిసి వెళ్లి పలు సూచనలు, సలహాలు అందించారు. అదేవిధంగా ఏఎన్‌ఎంలు కరుణ, అరుణ గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్‌ రవి, ఆశాలు భాగ్యమ్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. కాగా, కంటి వెలుగును విజయవంతం చేయాలని తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న తెలిపారు. కంటివెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్య శిబిరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలోని 36 వార్డుల్లో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. నేడు(గురువారం) 7వ వార్డు ఎన్టీఆర్‌ కాలనీ, 17వ వార్డు బస్తీ దవాఖానా, 33వ వార్డు కన్య పాఠశాలలో శిబిరాలు ప్రారంభించబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఆర్డీవో అశోక్‌కుమార్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ మేనేజర్‌ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు కోసం వసతులను ఏర్పాటు చేస్తున్నారు. కంటి వెలుగు సేవల కోసం 52 మంది సిబ్బందిని కేటాయించారు. అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమానికి కులకచర్ల మండల పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా మానిటరింగ్‌ అధికారి చంద్రప్రకాశ్‌ తెలిపారు. ఈమేరకు బండవెల్కిచర్ల గ్రామంలో కంటి వెలుగు నిర్వహణ ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి మాధురి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ జగదీశ్వర్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ ఉషారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ టి.ప్రవీణ్‌కుమార్‌ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులో ప్రజలకు అవగాహన కల్పించారు. కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, నేటి నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని సీహెచ్‌వో శివకుమార్‌ తెలిపారు. నవాబుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్యసిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. పూడూరు మండలం చన్‌గోముల్‌ గ్రామంలోని రైతు వేదికలో నేడు(గురువారం) ఉదయం 9 గంటలకు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ వరలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి చేతుల మీదుగా శిబిరం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-01-19T00:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising