ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రె్‌సతోనే బీసీలకు న్యాయం

ABN, First Publish Date - 2023-08-02T00:13:57+05:30

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని మాజీ పార్లమెంట్‌ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు.

మాట్లాడుతున్న నాయకుడు హనుమంతరావు

మాజీ ఎంపీ వి.హనుమంతరావు

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 1: కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని మాజీ పార్లమెంట్‌ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. మంగళవారం బాలాపూర్‌ పరిధిలోని వైఏఆర్‌ గార్డెన్‌లో బీసీల ఐక్య వేదిక జిల్లా సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి వీహెచ్‌ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్నారు. అనంతరం పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. గాంధీ, నెహ్రూ కాలం నుంచి నేటి వరకు దేశంలో బీసీలకు సముచిత న్యాయం కల్పించింది కాంగ్రెస్‌ పార్టేనన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లానర్సింహారెడ్డి, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌, సీనియర్‌ నాయకులు రమేష్‌, జగదీష్‌ జంగయ్యయాదవ్‌, జైపాల్‌, జితేందర్‌, పీసీసీ స్పోక్స్‌పర్సన్‌ గౌరీసతీష్‌, శేఖర్‌ మామ, అమరేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాతనర్సింహారెడ్డి, మాజీ జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ ఏనుగు జంగారెడ్డి, ప్రొటోకాల్‌ మెంబర్‌ బంగారుబాబు, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కుమార్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రవికాంత్‌గౌడ్‌, ఎన్‌ఎ్‌సయూఐ జిల్లా జనరల్‌ సెక్రటరీ, వినోద్‌చారి, అధికార ప్రతినిధి సులోచన పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising