బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN, First Publish Date - 2023-05-15T23:47:31+05:30
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 2023-24 సంవత్సరానికి 3, 5, 8 తరగతుల్లో ప్రవేశానికి గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వికారాబాద్ రూరల్, మే 15: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 2023-24 సంవత్సరానికి 3, 5, 8 తరగతుల్లో ప్రవేశానికి గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం ఖాళీలు 45కాగా 3వ తరగతిలో 22ఖాళీలు(ఎస్టీ బాలురు-13, బాలికలు-7)పీవీటీజీస్ చెంచు-2(బాలికలు-1, బాలురు-1), 5వ తరగతిలో 12ఖాళీలు (ఎస్టీ బాలురు -6, బాలికలు-4), పీవీటీజీస్ చెంచు-2, (బాలురు-1, బాలికలు-1), 8వ తరగతి ఖాళీలు-11 (ఎస్టీ బాలురు-6,బాలికలు-4) పీవీటీస్ చెంచు-1 చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు వికారాబాద్ జిల్లా వాస్తవ్యులై ఉండాలని వారి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలు ఉండాలన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు ఈనెల 18 నుంచి జూన్ 2 వరకు జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో లభిస్తాయని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 2న సాయంత్రం 5గంటల వరకు మాత్రమే స్వీకరించనున్నట్లు తెలిపారు. జూన్ 7న లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి 8న వివరాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 22న సీటు వచ్చిన విద్యార్థులు పాఠశాలలో రిపోర్ట్ చేయాలన్నారు.
Updated Date - 2023-05-15T23:47:31+05:30 IST