ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్ర్పీంగ్‌ సీజన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2023-08-22T23:23:57+05:30

తెలంగాణ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గ సంక్షేమశాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే పేద మైనార్టీ (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు బౌద్దులు పారసీలు) విద్యార్థులకు సీఎం విదేశీ విద్య పథకం స్ర్పింగ్‌ సీజన్‌ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు.

వికారాబాద్‌, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గ సంక్షేమశాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే పేద మైనార్టీ (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు బౌద్దులు పారసీలు) విద్యార్థులకు సీఎం విదేశీ విద్య పథకం స్ర్పింగ్‌ సీజన్‌ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.20లక్షల ఉపకారవేతనం, ఒకవైపు విమానరవాణా ఖర్చుల కింద రూ.60వేల వరకు మంజూరు చేయబడుతుందని తెలిపారు. డిగ్రీ(ఇంజనీరింగ్‌)లో 60శాతం మార్కులు ఉండి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేయడానికి అర్హులన్నారు. జనవరి 2023 నుంచి జూలై 2023 మధ్య కాలంలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొంది ఉన్న మైనార్టీ విద్యార్థులు పథకానికి అర్హులన్నారు. దరఖాస్తులను ఈనెల 21 లోపు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణపా్‌స.సీజీజీ.జీవోవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో సమర్పించాలన్నారు.

Updated Date - 2023-08-22T23:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising