ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పరిగిలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

ABN, First Publish Date - 2023-10-08T23:37:17+05:30

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెనుకబడిన తరగతుల్లో సామాజిక చైతన్యం రగిలించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డిలు అన్నారు.

పరిగి: చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి, అక్టోబరు 8: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెనుకబడిన తరగతుల్లో సామాజిక చైతన్యం రగిలించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డిలు అన్నారు. పరిగిలోని కోర్టు సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట పటిమను యావత్‌ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. ఐలమ్మ పోరాటం ఫలితంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనను దహించివేసిందన్నారు. నాలుగు వేల మంది అమరుల త్యాగాలతో తెలంగాణ చరిత్ర తిరగరాసిందని, 10లక్షల ఎకరాల భూ పంపిణీకి ఆమె పోరాటమే నాంది పలికిందన్నారు. ఐలమ్మ ఆశయసాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌ పాల్గొన్నారు.

అన్ని గ్రామాలకు రోడ్లు

పరిగి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు కలిపే లింక్‌ రోడ్లన్నీ థారు రోడ్లుగా మారుస్తామని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని రావులపల్లి, నర్సయాగూడెం గ్రామాలకు ఆదివారం థారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.10కోట్ల ఎస్‌జీఎఫ్‌ నిధులతో రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌ పాల్గొన్నారు.

పూర్తిస్థాయిలో డ్రైనేజీ పనులు చేయిస్తా

పరిగి మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో పూర్థిస్థాయి అండర్‌ డ్రైనేజీ పనులు చేయిస్తామని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మునిసిపల్‌ పరిధిలోని ఐదవవార్డులో అండర్‌ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, కమిషనర్‌ జి.శ్రీనివాసన్‌, ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, ఆర్‌.ఆంజనేయులు, బి.ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రె్‌సలో నుంచి బీఆర్‌ఎ్‌సలోకి చేరికలు

దోమ: మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ వార్డుసభ్యులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదివారం పరిగిలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, జడ్పీటీసీ నాగిరెడ్డి సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ కె.నాగిరెడ్డి, వైఎ్‌స ఎంపీపీ జి.మల్లేశం, పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌, నాయకులు రఫీక్‌, పవన్‌ పాల్గొన్నారు.

ముదిరాజ్‌ సంఘం భవనం ప్రారంభం

దోమ మండల కేంద్రంలో ఆదివారం పరిగి ఎమ్మెల్యే కే.మహేశ్‌రెడ్డి ముదిరాజ్‌ సంఘం భవానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌లు వ్యాపారం చేసుకునేందుకు వాహనాలు, వలలు ఉంచుకునేందుకు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు ముదిరాజ్‌ సంఘం భవనం నిర్మించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, మండల రైతు సమన్వయ కో ఆర్డినేటర్‌ బి.లక్ష్మయ్య, సహకార సంఘం నాయకులు అనంతయ్య, వెంకటయ్య, బుచ్చన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-10-08T23:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising