సీవీఆర్ కళాశాలలో ముగిసిన అంతర్జాతీయ సదస్సు
ABN, First Publish Date - 2023-07-23T00:36:30+05:30
మంగల్‌పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంఐడబ్ల్యూఏఐ-2023(మల్టీ డిసిప్లినరీ ఇంటర్‌నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్) పేరుతో రెండు రోజులుగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది.
ఆదిభట్ల, జూలై 22: మంగల్‌పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంఐడబ్ల్యూఏఐ-2023(మల్టీ డిసిప్లినరీ ఇంటర్‌నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్) పేరుతో రెండు రోజులుగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ అనువర్తనాలు, అనుబంధ నైపుణ్యాలపై సదస్సులో రెండో రోజు నేషనల్ ఫోరెన్సిక్ సైంటిఫిక్ యూనివర్సీటీ ప్రొఫెసర్ ఆహ్లాద్, ఎన్‌వీఐడీఐఏ సీనియర్ రీసెర్చ్‌సైంటిస్టు శివకుమార్‌శాస్ర్తిహరి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. రికరెంట్ న్యూరల్ నెట్‌వర్క్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ మూలసూత్రం ఆధారంగా లాంగ్వేజ్ కోడింగ్ పరివర్తనకు ఎలా ఉపయోగపడుతాయో ఆల్గారిఽథమ్స్‌తో వివరించారు. శివకుమార్‌శాస్ర్తిహరి మాట్లాడుతూ.. అట నమస్ వెహికిల్స్ పని విధానం, కోడింగ్ అంశాలను వివరించారు. హెచ్‌సీయూ ప్రొఫెసర్లు సి.రాఘవేందర్‌రావు, కె.నారాయణ మూర్తి ఏఐ ప్రాధాన్యాన్ని వివరించారు. చివరగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాలేజీ చైర్మన్ రాఘవ చిరాబుడ్డి, ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శివారెడ్డి, ఎ.వాణీవత్సల, సీఎ్‌ససీ విభాగం విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-07-23T00:36:30+05:30 IST