ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీవ్‌ స్వగృహ స్థల పరిశీలన

ABN, First Publish Date - 2023-03-02T00:02:58+05:30

రాజీవ్‌ స్వగృహ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించేందుకు కేటాయించిన స్థలాన్ని బుధవారం వికారాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌ శర్మ బుధవారం ఆర్డీవో అశోక్‌కుమార్‌తో కలిసి విక్రయించే ప్లాట్లు, వసతులను పరిశీలించారు. ప్రస్తుతం విక్రయించే ప్లాట్లకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

  • ప్రభుత్వానికి నివేదిస్తాం

  • వికారాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

  • గ్రామాల్లో నర్సరీల పరిశీలన

తాండూరు/తాండూరు రూరల్‌, మార్చి 1: రాజీవ్‌ స్వగృహ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించేందుకు కేటాయించిన స్థలాన్ని బుధవారం వికారాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌ శర్మ బుధవారం ఆర్డీవో అశోక్‌కుమార్‌తో కలిసి విక్రయించే ప్లాట్లు, వసతులను పరిశీలించారు. ప్రస్తుతం విక్రయించే ప్లాట్లకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. 150-250 గజాల ప్లాట్లు 14, 100-250 గజాల ప్లాట్లు 54 ప్రస్తుతం విక్రయానికి ఉన్నాయని అధికారులు వివరించారు. మండలంలోని సిరిగిరిపేట్‌ గ్రామ శివారులో స్వగృహ నిర్మాణాల కోసం కేటాయించిన సర్వేనెంబర్‌-109లో 26ఎకరాల భూమిని వారు పరిశీలించారు. ఆయన వెంట రాజీవ్‌ స్వగృహ అధికారులు, తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు, మున్సిపల్‌ మేనేజర్‌ నరేందర్‌రెడ్డి, టీపీఎస్‌ లాలప్ప ఉన్నారు.

పల్లె ప్రకృతివనాల్లో మొక్కలను పెంచాలి

తాండూరు మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం, హరిత హారంలో భాగంగా మొక్కలు అందించేందుకు నర్సరీల్లో మొక్కల పెంపకంపై అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆరా తీశారు. సిరిగిరిపేట్‌ గ్రామసమీపంలోని నర్సరీలో వెళ్లి మొక్కలను పరిశీలించారు. కొన్ని మొక్కలు ఇప్పటి వరకు మొలకెత్తకపోవడంతో పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. అన్ని నర్సరీల్లో మొక్కలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న మండల పంచాయతీ అధికారి రతన్‌సింగ్‌, ఏపీవో నరోత్తంరెడ్డిని ఆదేశించారు. తడి, పొడి చెత్త వేరుచేసేలా చర్యలు చేపట్టాలని సర్పంచ్‌ నందినిని ఆదేశించారు.

Updated Date - 2023-03-02T00:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!