ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూచిక బోర్డులు ఇలా.. ప్రయాణ దూరం తెలిసేదేలా..?

ABN, First Publish Date - 2023-04-07T22:20:23+05:30

ముందు వచ్చే గ్రామాల వివరాలు.. రోడ్డు ఎలా ఉంది.. ప్రయాణ దూరాన్ని తెలిపే సూచిక బోర్డుల గురించి పట్టించుకునే వారే లేరు. వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రయాణికులు అయోమయానికి గురువుతున్నారు

కింద పడిపోయిన సూచిక బోర్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఈదురుగాలులకు పడిపోయిన బోర్డులు

పట్టించుకోని అధికారులు

కొందుర్గు, మార్చి,23: ముందు వచ్చే గ్రామాల వివరాలు.. రోడ్డు ఎలా ఉంది.. ప్రయాణ దూరాన్ని తెలిపే సూచిక బోర్డుల గురించి పట్టించుకునే వారే లేరు. వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రయాణికులు అయోమయానికి గురువుతున్నారు. ప్రతీ గ్రామం వద్ద ఆ గ్రామం పేరు, అలాగే ముందు వచ్చే రోడ్డు ఎలా ఉంది, ఇంకా ఎంత దూరంలో ఏఏ గ్రామాలు ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకుగానూ రోడ్డు పక్కన సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కానీ అవి ఎలా ఉన్నాయో ఏ అధికారి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వర్షాకాలంలో ఈదురు గాలులకు సూచిక బోర్డులు ఎగిరిపోవడం గానీ, వంగి పోవడం గానీ, విరిగిపోవడం గానీ జరుగుతుంటాయి. అలా బోర్డులు అస్తవ్యస్తంగా ఉన్నాసంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. దీంతో వేల రూపాయలు వెచ్చింది ఏర్పాటు చేసిన ఆ బోర్డులు పనికిరాకుండా పోతున్నాయి. సూచిక బోర్డులు లేకపోతుండడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా వచ్చే వాహనదారులకు, తాము వెళ్లాల్సిన గ్రామం ఇంకా ఎంత దూరంలో ఉంది, రోడ్డు ఎలా ఉందో తెలియక తికమక పడుతున్నారు. కొందుర్గు మండలం రాంచంద్రాపూర్‌లో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు వర్షాలు కురిసిన సమయంలో వీచిన గాలులకు కింద పడిపోయాయి. రామచంద్రాపురం గ్రామం పేరున్న బోర్డును వృథాగా ఉన్న నాలుగు టైర్ల బండికి కట్టి ఉంచారు. అలాగే ముందు వచ్చే గ్రామాల వివరాలు తెలిపే బోర్డు ఊడిపోవడంతో దానిని కింద పెట్టారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి సూచిక బోర్డులను సరిచేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

బోర్డులను మళ్లీ ఏర్పాటు చేయాలి

సూచిక బోర్డులు కింద పడిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందు వచ్చే గ్రామాల వివరాలు తెలియడం లేదు. అస్తవ్య స్తంగా పడిపోయిన సూచిక బోర్డులను మళ్లీ ఏర్పాటుచేయాలి.

- దర్గా వెంకటేశ్‌, పర్వతాపూర్‌

Updated Date - 2023-04-07T22:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising