ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా కలప రవాణా!

ABN, First Publish Date - 2023-03-05T23:48:09+05:30

అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని అటవీ, పోలీస్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

చౌదరిగూడ, మార్చి 5 : అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని అటవీ, పోలీస్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల గ్రామంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఆదివారం రాత్రి ఏపీ 24 టీబీ 3079 నెంబర్‌ గల వాహనంలో కలప(టేకు దుంగలు) తరలిస్తుండగా గ్రామానికి చెందిన హసన్‌ అనే వ్యక్తి అటవీకి సంరక్షకుడిగా ఉన్న హజర్‌ అనే వ్యక్తికి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న హజర్‌ అటవీ శాఖకు చెందిన ఉన్నతస్థాయి ఆదేశాల మేరకే కలపను తరలిస్తున్నట్లు తెలిపి, వాహనాన్ని అక్కడి నుంచి పంపించేశాడు. ఈవిషయపై హసన్‌ సివిల్‌ పోలీసులకు సమాచారమందించినా పట్టించుకోలేదని మీడియాకు సమాచారం అందించాడు. అక్రమ కలప తరలింపుపై అటవీశాఖ ఉన్నతాఽధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-05T23:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising