ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా ఇసుక తరలింపు

ABN, First Publish Date - 2023-03-25T23:22:44+05:30

మండలంలోని గోనూర్‌ గ్రామ శివారులోని కాగ్నా నది నుంచి కొంత మంది అక్రమార్కులు రాత్రీపగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తూ పొలాల్లో డంపు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తాండూరు రూరల్‌, మార్చి 25: మండలంలోని గోనూర్‌ గ్రామ శివారులోని కాగ్నా నది నుంచి కొంత మంది అక్రమార్కులు రాత్రీపగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తూ పొలాల్లో డంపు చేస్తున్నారు. ఈవిషయంపై గ్రామస్థులు అక్రమార్కులను పట్టుకుని అక్రమ ఇసుక తరలింపును నివారించాలని కోరుతున్నారు. గోనూర్‌కు చెందిన నాలుగు ఇసుక ట్రాక్టర్లు రాత్రి, పగలనక కాగ్నానదిలో నుంచి గ్రామంలో అభివృద్ది పనుల పేరిట తీసుకువస్తూ డంపుచేసి అక్రమంగా ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. అయితే అక్రమ ఇసుక నివారణకు ఆయా శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అటు మైన్స్‌, ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మరికొందరైతే గ్రామంలోని నూతనంగా నిర్మించే ఇళ్ళ వద్ద నిల్వచేసుకుని విక్రయాలకు పాల్పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుకరవాణాను అరికట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2023-03-25T23:22:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising