నేడు మేడిపల్లిలో హైదరాబాద్ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ ప్రారంభం
ABN, First Publish Date - 2023-06-03T23:29:18+05:30
యాచారం, కందుకూరు మండలాల మధ్య ఏర్పాటవుతున్న హైదరాబాద్ గ్రీన్‌ఫార్మాసిటీ కోసం మేడిపల్లిలో హైదరాబాద్ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వరం డిప్యూటీ పోలీస్ కమిషనర్ చింతమనేని శ్రీనివా్‌సలు ప్రారంభించనున్నారు.
యాచారం, జూన్ 3 : యాచారం, కందుకూరు మండలాల మధ్య ఏర్పాటవుతున్న హైదరాబాద్ గ్రీన్‌ఫార్మాసిటీ కోసం మేడిపల్లిలో హైదరాబాద్ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వరం డిప్యూటీ పోలీస్ కమిషనర్ చింతమనేని శ్రీనివా్‌సలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు యాచారం పోలీసులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేషన్‌కు ఒక సీఐ, ఎస్సైలతో పాటు మరో 25 మంది కానిస్టేబుళ్లను నియమించారు. సీఐ, ఎస్సైలకు ప్రత్యేక చాంబర్లను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ పరిధిలోకి యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద, పిల్లిపల్లి, గొల్లగూడ, మంగలిగడ్డతండ, కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట, ఆకులమైలారం, పంజాగూడ, మాలగూడ, బేగరికంచ, వాయిల్లకుంటతండా, ముచ్చర్ల, ఉట్లపల్లి, సార్లరావులపల్లి, సాయిరెడ్డిగూడ, పోతుబండతండా, కడ్తాల మండలంలోని పల్లెచెల్కతండాలతో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. కాగా ఈ స్టేషన్ పరిధిలో కందుకూరు మండలంలోని గ్రామాలను విలీనం చేయరాదని ఆ మండల ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక మేడిపల్లిలో స్టేషన్ ఏర్పాటు చేస్తున్నా తమ గ్రామం పేరు ఎందుకు నమోదు చేయడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2023-06-03T23:29:18+05:30 IST