ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2023-06-26T22:51:27+05:30

ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న ఎస్‌.వీరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ ప్రజా సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ .వీరయ్య

పరిగి/మోమిన్‌పేట్‌/వికారాబాద్‌ రూరల్‌, జూన్‌ 26: ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. పేదల సమస్యల సాధనకు ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర సోమవారం పరిగి, మోమిన్‌పేట, వికారాబాద్‌లో సాగింది. ఈ సందర్భంగా మోమిన్‌పేట్‌లో ఆయన అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న ప్రతీ ఒక్కరికి 125 గజాల స్థలాన్ని కేటాయించాలన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందించాలన్నారు. గతంలో పట్టాలు పొందిన పేదవారికి ఇళ్ల స్థల సరిహద్దులను నిర్ణయించి భూమిని అప్పగించాలన్నారు. పరిగిలో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద తెలంగాణకు ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, రైతు సంఘం కార్యదర్శి పి.జంగారెడ్డి మాట్లాడుతూ, తొమ్మిదేళ్ల పాలనలలో ఎంతమందికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఇచ్చారని ప్రశ్నించారు. పరిగి నియోజకవర్గంలో అయితే ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. పరిగి మండలం రంగాపూర్‌లోని సర్వేనంబర్‌ 18లో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్‌, నాయకులు ఎం.వెంకటయ్య, ఆర్‌.మైపాల్‌, బుస చంద్రయ్య, రవి, హబీబ్‌, సత్తయ్య, లక్ష్మీ, సునీత పాల్గొన్నారు. కాగా వికారాబాద్‌లోని స్థానిక కార్యాలయంలో వీరయ్య మాట్లాడుతూ జూలై 3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని తెలిపారు. పి.మల్లేశం, మహిపాల్‌, రవి, శ్రీను నాయక్‌, సుదర్శన్‌, సతీష్‌, లాలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising