ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం
ABN, First Publish Date - 2023-02-10T00:06:41+05:30
సంఘమే శరణ్యం అది లేకుంటే అరణ్యం అనే నినాదంతో సంఘాన్ని ముందుకు నడిపించడం సంతోషకరంగా ఉందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్ తెలిపారు.
వికారాబాద్/పరిగి/కులకచర్ల, ఫిబ్రవరి 9 : సంఘమే శరణ్యం అది లేకుంటే అరణ్యం అనే నినాదంతో సంఘాన్ని ముందుకు నడిపించడం సంతోషకరంగా ఉందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్ తెలిపారు. గురువారం వికారాబాద్‌లోని పీఆర్టీయూ కార్యాలయ ఆవరణలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అధికారిక అభ్యర్థి చెన్నకేశవరెడ్డిని గెలిపించాలని సూచించారు. ఈసందర్భంగా విశ్రాంత హెచ్‌ఎంలు శ్రీ కిష్టయ్య, వీరేశం, ఉపాధ్యాయులు విజయకుమారి, బాలయ్య, రాష్ట్ర అసోసియేట్, కార్యదర్శులు రాజశేఖర్, మారుతి, వీరేశం, నర్సిములును శాలువాతో సత్కరించారు. వికారాబాద్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిములు, కె. బాబ్యానాయక్, ధారూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, మాణిక్యం, బంట్వారం అధ్యక్షులు సతీష్‌కుమార్, నవాబుపేట మండలాధ్యక్షులు విజయకుమార్‌రెడ్డి, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని పరిగి మునిసిపల్ చైర్మన్ ఎం.అశోక్, ఏఎంసీ చైర్మన్ సురేందర్, జడ్పీటీసీ బి.హరిప్రియలు అన్నారు. గురువారం పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరిగిలో జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంఈవో హరిశ్చందర్, జీహెచ్‌ఎంల సంఘం జిల్లా కార్యదర్శి హరిలాల్, పరిగి మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీశైలం, ఎండీ ఉస్మాన్, నాయకులు టి.వెంకటయ్య, బుగ్గయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కులకచర్లలో పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ 1971లో పామాల యాదగిరి పీఆర్టీయూను స్థాపించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో అబీబ్‌హమ్మద్, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు వెంకటయ్య, గౌరవాధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బస్వరాజ్, రాష్ట్ర నాయకులు పెంటయ్య, సతీష్, నర్సింహులుగౌడ్, తావుర్యానాయక్, వెంకటయ్య, జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-10T00:06:42+05:30 IST